నోరూరించే ఐస్ క్రీముల్లో బ్యాక్టీరియా వెలుగుచూసింది. దీంతో పలు ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తుల్ని వెనక్కు తెప్పించుకున్నాయి. ఈ ఘటన అగ్రరాజ్యం అమెరికాలో జరిగింది. హెర్షీస్(Hershey’s), జెనిస్(Jeni’s), ఫ్రోజెన్ ఫార్మర్(Frozen Farmer) కంపెనీలు తమ ప్రొడక్ట్స్ ను రీకాల్ చేశాయి.
ఏమైంది…
తక్కువ డిగ్రీల్లో ఉంచే ఐస్ క్రీములు కలుషితమై(Contaminate) ‘లిస్తేరియా’ బ్యాక్టరీ ఉత్పన్నమైనట్లు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(FDA) గుర్తించింది. ఆహారపదార్థాలు, దిగుమతులపై సునిశిత దృష్టిపెట్టే FDA.. ఐస్ క్రీముల కంపెనీలకు నోటీసులిచ్చింది. ఓవింగ్స్ మిల్స్, మేరీలాండ్ ప్రాంతాల్లో ప్రొడక్టుల్ని సీజ్ చేసింది. లిస్టెరియా మోనోసైటోజెనిస్ మూలాలతో లిస్టెరియోసిస్ ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే బ్యాక్టీరియా ఇది.
ఎలా వస్తుంది…
సున్నా డిగ్రీల సెల్సియస్ లో వాయురహితంగా ఉండేదే ఈ బ్యాక్టీరియా. అంటే ఆక్సిజన్ ఉన్నా లేకున్నా జీవించగలిగేది. అతిథేయ కణాల(Host’s Cells)తో వృద్ధి చెంది పునరుత్పత్తి చేయగల అత్యంత హానికర ఆహారపదార్థం. వ్యాధులతో బాధపడే వ్యక్తుల్లో ఇది 20% నుంచి 30% వరకు ఆహారం ద్వారా శరీరంలో లిస్టెరియోసిస్ ఇన్ఫెక్షన్లు ఉత్పత్తి చేసి ప్రాణాలు తీస్తుంది. 2008లో యూరోపియన్ యూనియన్లో 2,161 మందిలో బయటపడి 210 మందిని పొట్టనపెట్టుకుంది. USలో ఏటా 1,600 మందిలో సోకడం వల్ల 260 మంది చనిపోతున్నారు.
రీఫండ్…
ఈ ఐస్ క్రీములపై FDA రీసెర్చ్ కొనసాగుతూనే ఉంది. వాటిని తిప్పి పంపినవారికి కంపెనీలు రీఫండ్ చేస్తున్నాయి. రీకాల్ చేయాల్సిన ప్రొడక్టుల వివరాల్ని తమ వెబ్ సైట్లో ఉంచింది FDA. సున్నా డిగ్రీల కన్నా తక్కువ కూలింగ్ లో లక్షణాలు బయటపడలేదు.