భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది. గయానాలో వర్షం పడే ఛాన్సెస్ గంట గంటకూ మారతాయని అక్కడి వాతావరణ(Weather) రిపోర్ట్స్ చెబుతున్నాయి. దక్షిణాఫ్రికా-అఫ్గానిస్థాన్ సెమీఫైనల్ కు భిన్నంగా గయానా పరిస్థితులుంటాయని అంచనా వేసింది. అక్కడి కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు ఆట మొదలవుతుంది.
మ్యాచ్ కు ముందురోజే జల్లులు పడటం ఇందుకు ఎగ్జాంపుల్. రోజంతా వాన పడే ప్రమాదమూ పొంచి ఉంది. ఆట రద్దయితే భారత్ నేరుగా ఫైనల్ చేరుతుంది. సూపర్-8లో 6 పాయింట్లతో టీమ్ఇండియా, 4 పాయింట్లతో ఇంగ్లండ్ ఉన్నాయి.
వెస్టిండీస్, భారత కాలమానాల ప్రకారం వర్షం పడే శాతం ఇలా…
వెస్టిండీస్ సమయం | భారత కాలమానం (IST) | వర్షం పడే ఛాన్సెస్ |
9:00 AM | 6:30 PM | 40% |
10:00 AM | 7:30 PM | 66% |
11:00 AM | 8:30 PM | 75% |
12:00 PM | 9:30 PM | 49% |
1:00 PM | 10:30 PM | 34% |
2:00 PM | 11:30 PM | 34% |
3:00 PM | 12:30 AM | 40% |