గూగుల్ CEO సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్య నాదెళ్ల.. భారత సంతతి వ్యక్తుల్లో అత్యధిక సంపాదనపరులు(Highest Paid) అనుకుంటాం. కానీ వారిద్దర్నీ దాటి ఎలాన్ మస్క్, జుకర్ బర్గ్ స్థాయిలో ఆదాయం పొందితే.. అంత గొప్పవాళ్లున్నారా అని అనుకోక తప్పదు. అంతలా సంపాదిస్తున్న ఆ భారత సంతతి CEO.. అమెరికాలో టాప్-పెయిడ్ ఎగ్జిక్యూటివ్ గా లిస్ట్ అయ్యారు.
నికేశ్ అరోరా…
ఏ ఉద్యోగానికీ గ్యారంటీ లేని ఈ రోజుల్లో ఎలాన్ మస్క్ స్థాయిలో సంపాదిస్తున్నారంటే ఆశ్చర్యమే. CAP(కాంపెన్సేషన్ యాక్చువల్లీ పెయిడ్) పేరిట 2023లో 151.4 మిలియన్ డాలర్లు(రూ.1,283 కోట్లు) సంపాదించిన ఆ CEO నికేశ్ అరోరా. పాలో ఆల్టో నెట్వర్క్ సీఈవో అయిన నికేశ్.. సిలికాన్ వ్యాలీ(Silicon Valley)లో భారీ ఆర్జన గల చీఫ్ గా 10వ స్థానంలో ఉన్నారని C-Suite Comp సంస్థ రీసెర్చిలో తేలింది.
కానీ అరోరా మొత్తం ఆదాయం వాస్తవానికి 266.4 మిలియన్ డాలర్లు(రూ.2,261 కోట్లు) కాగా.. ఈ లిస్టులో నాదెళ్ల, పిచాయ్ కూడా లేరట. ఢిల్లీ ఎయిర్ ఫోర్స్ పబ్లిక్ స్కూల్లో చదివిన ఈ టెక్ దిగ్గజం గూగుల్ లో చీఫ్ బిజినెస్ ఆఫీసర్ గా పనిచేశారు. 2014లో గూగుల్ నుంచి బయటకొచ్చి 2018 వరకు జపాన్ సాఫ్ట్ బ్యాంకులో సేవలందించాక సైబర్ సెక్యూరిటీ కంపెనీ పాలో ఆల్టో నెట్వర్క్ బాస్ అయ్యారు. ఆశ్చర్యమేంటంటే అతడు వాల్ స్ట్రీట్ జర్నల్ 2023 లిస్టులో రెండో స్థానంలో ఉన్నాడు.
ప్రపంచ టాప్-10 సంపాదనపరులు వీరే…
ర్యాంక్ | పేరు | కంపెనీ | ఆదాయం(డాలర్లు-రూపాయల్లో) |
1 | ఎలాన్ మస్క్ | టెస్లా | 1.4 బి.డా.(11,900 కోట్లు) |
2 | అలెగ్జాండర్ కాప్ | పాలంటీర్ టెక్నాలజీస్ | 1.1 బి.డా.(9,350 కోట్లు) |
3 | హాక్ ట్యాన్ | బ్రాడ్ కామ్ | 767.7 మి.డా.(6,519 కోట్లు) |
4 | బ్రియాన్ ఆర్మ్ స్టాంగ్ | కాయిన్ బేస్ గ్లోబల్ | 680.9 మి.డా.(5,780 కోట్లు) |
5 | సాఫ్రా కాట్జ్ | ఒరాకిల్ | 304.1 మి.డా.(2,584 కోట్లు) |
6 | బ్రియాన్ చెస్కీ | ఎయిర్బీఎన్బీ(Airbnb) | 303.5 మి.డా.(2,575 కోట్లు) |
7 | జాన్ వింకెల్ రీడ్ | టీపీజీ | 295.1 మి.డా.(2,507 కోట్లు) |
8 | జెఫ్ గ్రీన్ | ట్రేడ్ డెస్క్ | 291.7 మి.డా.(2,473 కోట్లు) |
9 | ఆడమ్ ఫారొఫి | ఆప్లోవిన్ | 271.3 మి.డా.(2,303 కోట్లు) |
10 | నికేశ్ అరోరా | పాలో ఆల్టో నెట్వర్క్స్ | 266.4 మి.డా.(2,261 కోట్లు) |