ఇంగ్లండ్ తో జరుగుతున్న సెమీస్ లో భారత్.. మరింత భారీ స్కోరు చేయలేకపోయింది. ఈ టోర్నీలోనే ఫామ్ లో లేని విరాట్(9) మరోసారి తక్కువకే ఔటైతే ఆ వెంటనే పంత్(4) కూడా పెవిలియన్ చేరాడు. కానీ కెప్టెన్ రోహిత్(57; 39 బంతుల్లో 6×4, 2×6) మరోసారి రాణిస్తూ సూర్యకుమార్(47; 36 బంతుల్లో 4×4, 2×6) సెకండ్ వికెట్ కు 73 పరుగులు జత చేశాడు. కానీ ఆ ఇద్దరూ భారీ షాట్లకు యత్నించి వికెట్ పారేసుకున్నారు. హార్దిక్(23), దూబె(0) వరుస బాల్స్ లో ఔటయ్యారు.
113/3తో కనపడ్డ స్కోరు కాస్తా 146/6కు చేరుకోగా.. చివర్లో జడేజా, అక్షర్ పటేల్ జోడీ స్కోరును 150 దాటించింది. మరింత ఎక్కువ రన్స్ చేయాల్సిన టీమ్ఇండియా.. మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళ్లడంతో నిర్ణీత ఓవర్లలో 171/7కే పరిమితమైంది. క్రిస్ జోర్డాన్ 3 వికెట్లతో రోహిత్ సేనను కట్టడి చేశాడు.