మూడు వన్డేల సిరీస్ ను 3-0తో గెలిచిన భారత మహిళల జట్టు ఏకైక టెస్టులోనూ దక్షిణాఫ్రికా బౌలింగ్ ను ఆటాడుకుంది. ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలి వర్మ సెంచరీలతో విరుచుకుపడి సౌతాఫ్రికా బౌలింగ్ ను ఊచకోత కోశారు. ఓవర్ కు 5.50 రన్ రేట్ కు పైగా సాగించిన దాడి వన్డే(ODI) మ్యాచ్ ను మించింది.
అందితే బాదుడే…
చెన్నై చెపాక్(MA Chidambaram) స్టేడియంలో జరుగుతున్న టెస్టులో ఓపెనర్లిద్దరూ ఒకర్ని మించి మరొకరు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. 292 స్కోరు వద్ద తొలి వికెట్ పడిందంటే స్మృతి, షెఫాలి జోడీ ఎలా ఆడిందో అర్థమవుతుంది. స్మృతి(149; 161 బంతుల్లో 27×4, 1×6) ఔటైనా షెఫాలి(155 బ్యాటింగ్; 161 బంతుల్లో 20×4, 5×6) ఉతికి ఆరేసింది.