పార్టీ వాహనానికి వారాహి అని నామకరణం చేసి ఎన్నికలకు ముందు కొండగట్టులో పూజలు నిర్వహించిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. తాము కొలిచే అంజన్నకు మరోసారి మొక్కులు తీర్చుకోబోతున్నారు. రేపు ఉదయం 7 గంటలకు హైదరాబాద్ మాదాపూర్లోని ఆయన నివాసం నుంచి రోడ్డు మార్గాన బయల్దేరి జగిత్యాల జిల్లాలోని అంజన్న సన్నిధికి చేరుకుంటారు. ఇందుకోసం జనసేనతోపాటు పవన్ ఫ్యాన్స్ పెద్దయెత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణలోనూ…
తెలంగాణలోనూ జనసేన బలోపేతం(Strengthen)పై దృష్టిపెట్టిన AP డిప్యూటీ సీఎం.. ప్రజాసమస్యలపై చర్చిస్తారని, ఆ తర్వాత వివిధ పార్టీల నుంచి చేరికలు ఉంటాయని జనసేన నేతలు అంటున్నారు. సిరిసిల్ల చేనేత కార్మికుల సమస్యలపై ఆయన మాట్లాడబోతున్నారు.