2024 సంవత్సరానికి జాతీయ ఉపాధ్యాయ పురస్కారాల(Awards)లకు గాను దరఖాస్తుల్ని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానిస్తున్నది. జిల్లా, మండల పరిషత్ సహా ఎయిడెడ్ పాఠశాలల్లో సేవలందించే టీచర్లు అప్లయ్ చేసుకోవాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటన వెలువరించింది.
ఈ దరఖాస్తుల రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ ఈ జులై 15 కాగా.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఆ లోపు అప్లికేషన్లు పంపాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నోట్ ను విడుదల చేసింది.
గైడ్ లైన్స్ పై…
మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ & లిటరసీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ http//nationalawardstoteachers.education.gov.in ద్వారా ఎంపిక ప్రక్రియకు సంబంధించిన వివరాల్ని తెలుసుకోవచ్చని స్పష్టం చేసింది.