వేగంగా దూసుకొచ్చే(Seam) బంతులు పెద్దగా వర్కవుట్ అవ్వట్లేదు.. కానీ గిరగిరా తిరిగే(Spin) బాల్స్ మాత్రం వికెట్లను కూల్చేస్తున్నాయి. కాళ్ల ముందు పడిన బంతి ఆఫ్ సైడ్ వెళ్తుందా, లెగ్ సైడ్ పోతుందా అన్నది లోపలికి చొచ్చుకెళ్లేదాకా తెలియట్లేదు. అంతలా ప్రభావం(Effect) చూపుతున్న స్పిన్నర్ల సమరంలో నేడే ఫైనల్ కాగా రాత్రి 8 గంటలకు మ్యాచ్.
సూపర్-8 నుంచి స్పిన్నర్ల హవానే. కుల్దీప్ యాదవ్ డెలివరీల్ని ఆడాలంటే అపసోపాలు(Problems) పడుతున్నారు మేటి బ్యాటర్లు. సెమీస్ లో ఇంగ్లండ్ కథ క్లోజ్ అవ్వడానికి అక్షర్ పటేల్ దే పాత్ర. పెద్దగా రాణించకున్నా.. ఛాన్స్ దొరికితే జడేజా వదలడు. పేసర్లు బుమ్రా(13), అర్షదీప్(15) పోటాపోటీగా వికెట్లు తీస్తున్నారు.
సౌతాఫ్రికా ప్లేయర్లు షంసి, మహరాజ్ రాణిస్తున్నా.. స్పిన్నర్లను రోహిత్, సూర్య, హార్దిక్ పాండ్య వదిలిపెట్టట్లేదు. జంపా, రషీద్ ను దీటుగా ఎదుర్కొని ధారాళంగా పరుగులు తీశారు. కోహ్లి, పంత్, దూబె రాణిస్తే మనకు తిరుగుండదు. వర్షం పడే ఛాన్సెస్ ఉన్నా రిజర్వ్ డే ఉంది.