టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ కు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 34 పరుగులకే మూడు ప్రధాన వికెట్లు కోల్పోయింది. మార్కో యాన్సన్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో కోహ్లి 15 రన్స్ బాదితే ఆ తర్వాత… బంతిని కేశవ్ మహరాజ్ కు అప్పగించాడు సౌతాఫ్రికా కెప్టెన్. అతడు వేసిన ఆ ఓవర్లో భారత్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
కెప్టెన్ రోహిత్(9), పంత్(0) ఇద్దరూ 23 స్కోరు వద్ద పెవిలియన్ చేరారు. తన బౌలింగ్ లోనే కంటిన్యూగా రెండు ఫోర్లు బాదిన రోహిత్ ను వెంటనే ఔట్ చేశాడు. చివరకు సూర్యకుమార్ యాదవ్(3) కూడా భారీ షాట్ కు యత్నించి వికెట్ సమర్పించుకున్నాడు. గ్రూప్ స్టేజ్, సూపర్-8, సెమీస్ అంతా బాగా ఆడిన రోహిత్ చివరకు ఫైనల్లో చేతులెత్తేస్తే… టోర్నీ అంతా విఫలమైన కోహ్లి తుది పోరులో నిలబడ్డాడు.