టోర్నీ మొత్తం ఆడకున్నా అసలైన మ్యాచ్ లో కోహ్లి నిలిచాడు. కీలక ఫైనల్ లో హాఫ్ సెంచరీతో రాణించి తానేంటో చాటిచెప్పాడు. మిగతా బ్యాటర్లు దూకుడుగా ఆడేలా మరో ఎండ్ లో నిదానంగా ఉన్న విరాట్.. తన వికెట్ ఎంత విలువైందో చెబుతూనే అదే రీతిలో తన మార్క్ ను చూపించాడు. అప్పటిదాకా మెల్లగా ఆడిన కోహ్లి 18వ ఓవర్లో విజృంభించాడు. ఆ ఓవర్లో సిక్స్, ఫోర్ తో మొత్తం 16 రన్స్ రాబట్టాడు.
కెప్టెన్ రోహిత్(9), పంత్(0) సూర్యకుమార్ యాదవ్(3) తొందరగా ఔటైనా.. అక్షర్(47; 31 బంతుల్లో 1×4, 4×6)తో కలిసి ఇన్నింగ్స్ ను నడిపించాడు. చివర్లో కోహ్లి(76; 59 బంతుల్లో 6×4, 2×6) విజృంభించడంతో టీమ్ఇండియా 176/7 చేసింది. దూబె(27; 16 బంతుల్లో 3×4, 4×6) బాగా ఆడితే, హార్దిక్(5) నాటౌట్ గా నిలిచాడు. మొత్తంగా దక్షిణాఫ్రికాకు మంచి టార్గెట్ నే ఉంచింది రోహిత్ సేన. ఈ పిచ్ పై జరిగిన ఫైనల్ మ్యాచుల్లో ఇదే అత్యధిక(Highest) స్కోరు కావడం విశేషం.