క్రికెట్ అయినా, ఏ ఆటలోనైనా జీవితకాలం(Life Time)లో ఎంతగొప్పగా ఆడినా ముగింపు మాత్రం బాధాకరంగా ఉండే ఆటగాళ్లే ఎక్కువ. కానీ అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆ ఆటగాళ్లకున్న ఆనందం వెలకట్టలేనిది. అలాంటి అనుభూతుల్లోనే ఉన్నాడు విరాట్ కోహ్లి. IPLలో ఘనంగా ఆడి టీ20 వరల్డ్ కప్ కు కీలకమవుతాడని భావించిన తరుణంలో.. గ్రూప్, సూపర్-8, సెమీఫైనల్ ఇలా అన్ని మ్యాచుల్లో ఫెయిలయిన కోహ్లి ఫైనల్ లో మాత్రం అన్నీ తానై నడిపించాడు. కెరీర్లోనే అద్భుతమన్నట్లుగా ఒకవైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో పోరాటయోధునిలా నిలబడ్డాడు.
ఘనంగా చాటి…
ఫైనల్లో 76 పరుగులు చేసిన కోహ్లి.. దేశానికి కప్పు అందించినా ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చాడు. టీ20 క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రజంటేషన్ కార్యక్రమంలో ప్రకటించాడు. అండర్-19 కెప్టెన్ గా వరల్డ్ కప్.. IPLలో 8,000 పరుగులు.. 125 టీ20ల్లో 4,188 రన్స్ చేసిన కోహ్లి.. పొట్టి ఫార్మాట్ కు రిటైర్మెంట్ తీసుకున్నాడు. కుర్రాళ్లకు అవకాశమిచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానన్నాడు.