పురుషుల జట్టు ఇచ్చిన స్ఫూర్తి ఏమో.. మహిళల జట్టూ(Women Team) చెలరేగిపోయింది. నిన్న దక్షిణాఫ్రికాను ఓడించి ‘మెన్ ఇన్ బ్లూ’ టీ20 కప్పు అందుకుంటే.. ఈరోజు అదే దేశ వుమెన్ టీమ్ పై హర్మన్ ప్రీత్ సేన పూర్తి ఆధిపత్యం చూపింది. చెన్నైలో జరుగుతున్న ఏకైక టెస్టులో చెలరేగి ఆడి తొలి ఇన్నింగ్స్ లో 603/3తో భారీ స్కోరు చేసిన భారత్.. ఆ టీమ్ ను 266కే కుప్పకూల్చింది.
స్నేహ్ రాణా షో…
337 రన్స్ వెనుకబడ్డ సౌతాఫ్రికాను ఫాలోఆన్ ఆడించింది భారత్. స్పిన్నర్ స్నేహ్ రాణా 8 వికెట్ల షోతో మ్యాచును ఏకపక్షం(One Side) చేసింది. ఆమె స్పిన్ వలలో చిక్కి బ్యాటర్లంతా విలవిల్లాడారు. గిరగిరాలు తిరిగే బంతుల్ని ఆడలేక సౌతాఫ్రికా మహిళలు వికెట్లు పారేసుకున్నారు. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆ జట్టు 16 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 2 వికెట్లు తీసిన దీప్తి శర్మ, రెండో ఇన్నింగ్స్ లో తొలి వికెట్ ను తీసింది.