భారత మహిళా స్పిన్నర్ స్నేహ్ రాణా రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 10 వికెట్లు తీయడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో ఉమెన్ టీమ్ ఘన విజయం(Big Win) సాధించింది. చెన్నైలో జరుగుతున్న మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో హర్మన్ సేన 603/6 స్కోరు వద్ద డిక్లేర్డ్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా.. స్నేహ్ రాణా 8 వికెట్లు తీయడంతో 266 రన్స్ కే కుప్పకూలింది.
సూపర్ స్పిన్…
ఫాలోఆన్ లో పడి రెండో ఇన్నింగ్స్ ఆడిన దక్షిణాఫ్రికా లారా వొల్వార్త్(122), సునె లువస్(109) సెంచరీలతో 373 స్కోరుకు ఆలౌటైంది. దీంతో భారత మహిళల టీమ్ కు 37 పరుగుల టార్గెట్ విధించడంతో ఓపెనర్లు శుభ సతీష్(13), షెఫాలి వర్మ(24) లాంఛనం పూర్తి చేయడంతో భారీ విజయం దక్కింది. ప్రత్యర్థి రెండో ఇన్నింగ్స్ లోనూ స్నేహ్ రాణా రెండు వికెట్లు తీసి మొత్తం ఈ మ్యాచ్ లో 10 వికెట్లు ఖాతాలో వేసుకుని రికార్డు సృష్టించింది.