ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట(Stampede)లో 60 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మంది దాకా గాయాల పాలయ్యారు. ఇందులో ఎక్కువ మంది మహిళలు ఉండగా.. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్(Hathras) జిల్లాలోని రతిభాన్పూర్ లో జరిగింది.
శివుడి కార్యక్రమంలో భాగంగా సత్సంగ్ నిర్విహస్తున్నారు. అక్కడ ఉన్నట్టుండి తొక్కిసలాట జరిగి భారీగా ప్రాణనష్టం సంభవించింది. బాధితులందర్నీ సమీపంలోని ఇటా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంటులో ప్రస్తావించి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది ప్రైవేటు కార్యక్రమైనా స్థానిక సబ్-డివిజనల్ మెజిస్ట్రేట్(SDM) పర్మిషన్ ఉంది. ఈ ఘటనపై ఆగ్రా అడిషనల్ DG, అలీగఢ్ కమిషనర్ ఆధ్వర్యంలో అత్యున్నత స్థాయి కమిటీ(High Level)తో విచారణ జరుపుతున్నారు. ఎక్కువ మంది గుమికూడటం వల్లే దుర్ఘటన జరిగిందని డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆశిష్ కుమార్ తెలిపారు.