పోలీసుల పిల్లలు తాము ఖాకీల కుటుంబాల నుంచి వచ్చామని చెప్పుకోవడానికే ఇబ్బంది పడతారని, పోలీసు శాఖపై సమాజంలో ఉన్న అభిప్రాయంతోనే అలా చేస్తున్నారని CM రేవంత్ రెడ్డి అన్నారు. తాను మాత్రం తన అన్న కానిస్టేబుల్ కావడం వల్లే CM స్థాయికి వచ్చానని పాత రోజుల్ని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ 3 కమిషనరేట్ల పోలీసు అధికారులతో CM రివ్యూ నిర్వహించారు.
ప్రత్యేక స్కూళ్లు…
సైనిక స్కూళ్ల మాదిరిగానే పోలీసుల పిల్లలకు ప్రత్యేకంగా విద్యాలయాలు(Schools) ఏర్పాటు చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. మనం ఏ స్థాయిలో ఉన్నా, ఎంత సంపాదించినా మన పిల్లలే డ్రగ్స్ బారిన పడితే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. హోంగార్డు నుంచి DGP పిల్లలు చదువుకునేలా గ్రేహౌండ్స్ కు చెందిన 50 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయబోయే సూళ్లల్లో 6 నుంచి PG వరకు ఉచిత విద్య అందిస్తామన్నారు.
మితిమీరిన భద్రతనా…
రాజకీయ నాయకులమైన తమకు మితిమీరిన భద్రత వద్దని, ఆ రక్షణ తగ్గించి నేరాలపై నిఘా పెట్టాలని ఉన్నతాధికారులకు సూచించారు. తన అన్న భూపాల్ రెడ్డి వనపర్తిలో కానిస్టేబుల్ గా పనిచేస్తూ చదివించారని, ఆ పెంపకంతోనే తానీరోజు ఈ స్థాయికి వచ్చానని అందరికీ తెలియజేశారు.