హరికేన్(తుపాను) ప్రభావంతో వెస్టిండీస్ బార్బడోస్ లోనే ఐదు రోజులపాటు చిక్కుకుపోయిన భారత క్రికెటర్లను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానం(Flight)లో తీసుకొచ్చింది. వరల్డ్ కప్ గెలిచిన టీమ్, సపోర్టింగ్ స్టాఫ్ సహా వారి కుటుంబ సభ్యులు, 22 మంది మీడియా ప్రతినిధుల్ని తీసుకొచ్చిన ఎయిరిండియా ఫ్లైట్ ఈ ఉదయం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దిగింది.
ఫ్లైట్ పేరే…
ఆటగాళ్లను తీసుకొచ్చిన ఫ్లైట్ కు ‘AIC24WC’ అని పేరు పెట్టారు. దీనర్థం ‘ఎయిర్ ఇండియా ఛాంపియన్స్ 24 వరల్డ్ కప్. బోయింగ్-777 విమానం బ్రిడ్జిటౌన్ నుంచి బయల్దేరి న్యూయార్క్, న్యూజెర్సీ మీదుగా ఢిల్లీ చేరుకుంది. ఆటగాళ్లంతా ఐటీసీ మౌర్య హోటల్లో కాసేపు ఉండి అక్కణ్నుంచి 7 లోక్ కళ్యాణ్ మార్గ్ కు చేరుకుని ప్రధానితో బ్రేక్ ఫాస్ట్ చేశారు.