గులాబీ పార్టీ నుంచి ఇప్పటికే ఆరుగురు MLAలు రాజీనామాలు చేసి వెళ్లిపోతే వాళ్లకంటే మేమేం తక్కువనా అన్నట్లు అదే సంఖ్యలో ఒకేసారి MLCలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తెల్లారితే అమావాస్య అన్న చందంగా అర్థరాత్రి దాటిన తర్వాత హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జూబ్లీహిల్స్ లోని CM నివాసంలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ ఆధ్వర్యంలో చేరికలు జరిగిపోయాయి.
వారు వీరే…
BRS నుంచి గెలిచిన శాసనమండలి సభ్యులు దండె విఠల్, భానుప్రసాద్ రావు, ఎం.ఎస్.ప్రభాకర్, బొగ్గారపు దయానంద్, యెగ్గె మల్లేశం, బస్వరాజ్ సారయ్య ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. వీరితో కాంగ్రెస్ పార్టీ MLCల సంఖ్య 12కు చేరుకుంది. హడావుడి, ముందస్తు సమాచారం లేకుండా కండువా కప్పుకునేదాకా బయటకు పొక్కనివ్వలేదు.
తొలుత హోటల్లో…
తొలుత ఒక హోటల్లో భేటీ అయిన వీరంతా అర్థరాత్రి CM ఇంటికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి అదే టైంలో ఢిల్లీ నుంచి రాగానే చేరికలు జరిగిపోయాయి. ఇప్పటికే ఆరుగురు MLAలు పార్టీ మారగా.. ఇప్పుడంతే సంఖ్యలో MLCలు సైతం BRS బై బై చెప్పారు.