కేరళ రాష్ట్రంలో మరో అరుదైన(Rare) వ్యాధి వెలుగుచూసింది. 14 ఏళ్ల బాలుడు మరణించడం, గత మూడు నెలల్లో ముగ్గురు మృత్యువాత పడటంతో పినరయి విజయన్ సర్కారు హైఅలర్ట్ ప్రకటించింది. మెదడు(Brain)ను తినే ఈ పురుగు అతి తక్కువ కాలంలోనే మనిషి ప్రాణాలు తీస్తుంది.
ఎలా వస్తుంది…
అమోబా(Amoeba) ఇన్ఫెక్షన్ను వైద్య పరిభాషలో అమోబిక్ మెనింజో యెన్సైఫలిటీస్ గా పిలుస్తారు. అత్యంత అరుదైన మెదడు వ్యాధిగా భావించే ఈ వైరస్ కలుషిత నీటి వల్ల వస్తుంది. స్నానం చేసేటప్పుడు ముక్కు(Nose)లో చేరి నరాల ద్వారా మెదడుకు వెళ్తుంది. కోజికోడ్(Kozhikode)కు చెందిన 14 ఏళ్ల బాలుడు కుంటలో స్నానం చేస్తున్నప్పుడు వైరస్ సోకింది.
10 రోజులకే…
జూన్ 24న ఆస్పత్రిలో చేరిన బాబుకు ట్రీట్మెంట్ అందిస్తుండగా నిన్న ప్రాణాలు కోల్పోయాడు. 10 రోజులకే కన్నుమూయడం కేరళలో సంచలనంగా మారగా.. మూణ్నెల్ల కాలంలో ఇది మూడో ఘటన. మే(May)లో మలప్పురానికి చెందిన ఐదేళ్ల పాప.. జూన్లో కన్నూర్ కు చెందిన 13 సంవత్సరాల బాలిక మృతిచెందారు.
ఏకకణ జీవి…
యుకర్యోట్ నైగ్లేరియా ఫొలెరీ అనే ఈ ఏక కణ జీవి(Unicellular).. మెదడులో స్వేచ్ఛగా సంచరిస్తుంటుంది. కలుషిత నీటిలో పుట్టి ఆ జలాన్ని వాడిన వారికి సోకుతుంది. తలనొప్పి, జ్వరం, వాంతులు తొలుత.. మెడ మొద్దబారటం, మతి స్థిమితం కోల్పోవడం, కోమాకి చేరడం ఆ తర్వాత ఉంటాయి. 1 నుంచి 12 రోజుల్లో పుట్టే ఈ జీవి సోకిన 5 నుంచి 18 రోజుల్లోనే మెదడును తినేస్తుంది. ప్రతి 10 లక్షల మందిలో కేవలం 2.6 మందికే ఇది సోకే వ్యాధి పట్ల కేరళ వైద్య మంత్రి వీణా జార్జ్.. ఆరోగ్యశాఖను అలర్ట్ చేశారు.