గ్రూప్-2, గ్రూప్-3 పోస్టుల సంఖ్య పెంచాలని, DSC వాయిదా(Postpone) వేయడం సహా వివిధ సమస్యలపై నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలపై CM రేవంత్ స్పందించారు. వారు ప్రస్తావించిన డిమాండ్లపై కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల లీడర్లతోపాటు అధికారులతో చర్చించారు. శాసనసభ(Assembly)లో ఈ అంశంపై చర్చించిన మీదట నిర్ణయం తీసుకుంటామని క్లారిటీ ఇచ్చారు.
కృతనిశ్చయంతో…
ఉద్యోగాల భర్తీ విషయంలో డౌట్లు వద్దని, రిక్రూట్మెంట్లపై సర్కారు కృతనిశ్చయంతో ఉందని CM గుర్తు చేశారు. కొన్ని పార్టీలు స్వార్థపూరితంగా కుట్రలకు పాల్పడుతున్నాయని, వాటికి నిరుద్యోగులు బలికావొద్దన్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న CM.. ఎగ్జామ్స్ డేట్స్ పై TGPSC, విద్యాశాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.