లక్షల్లో జీతాలు అందుకుంటున్న రైల్వే ఉన్నతాధికారులు వారు. కానీ అవినీతి కేసులో CBIకి చిక్కి కటకటాలు లెక్కబెడుతున్నారు. అరెస్టయిన వారిలో డివిజనల్ రైల్వే మేనేజర్(DRM) ఉండగా.. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని గుంతకల్లులో జరిగింది.
దక్షిణ మధ్య రైల్వే గుంతకల్ DRM వినీత్ సింగ్ తోపాటు సీనియర్ డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్(Sr DFM) కుందా ప్రదీప్ బాబు.. సీనియర్ డివిజనల్ ఇంజినీర్(Sr DEN) యు.అక్కిరెడ్డి.. ఆఫీస్ సూపరింటెండెంట్ ఎం.బాలాజీ.. అకౌంట్ అసిస్టెంట్ డి.లక్ష్మీపతిరాజు అరెస్టయ్యారు. వీరందర్నీ అదుపులోకి తీసుకున్నట్లు CBI ప్రకటించింది.