కేరళలో మరో అరుదైన(Rare) వ్యాధి అత్యంత తక్కువ రోజుల్లోనే ప్రాణాలు తీసేస్తున్నది. మూడు నెలల్లో నలుగురు మృతిచెందడం ఆందోళనకరంగా మార్చింది. ఈ పురుగు తలలోకి చేరి మెదడు(Brain) మొత్తాన్ని తినేస్తుంటుంది.
ఎలా వస్తుంది…
అమోబా(Amoeba) ఇన్ఫెక్షన్ను వైద్య పరిభాషలో అమోబిక్ మెనింజో యెన్సైఫలిటీస్ గా పిలుస్తారు. ఈ వైరస్ కలుషిత నీటి వల్ల పుట్టి.. అందులో స్నానం చేసేటప్పుడు ముక్కు(Nose)లో చేరి నరాల ద్వారా మెదడుకు వెళ్తుంది. రెండ్రోజుల క్రితం కోజికోడ్ కు చెందిన 14 ఏళ్ల బాలుడు మరణిస్తే.. ఇప్పుడు పియోలిలోనూ మరో 14 ఏళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు.
10 రోజులకే…
మూణ్నెల్ల కాలంలో ఇది నాలుగోది కాగా మేలో మలప్పురానికి చెందిన ఐదేళ్ల పాప.. జూన్లో కన్నూర్ కు చెందిన 13 ఏళ్ల బాలిక మృతిచెందారు. యుకర్యోట్ నైగ్లేరియా ఫొలెరీ అనే ఈ ఏక కణ జీవి(Unicellular).. మెదడులో స్వేచ్ఛగా సంచరిస్తుంటుంది.
తలనొప్పి, జ్వరం, వాంతులు తొలుత.. మెడ మొద్దబారటం, మతి స్థిమితం కోల్పోవడం, కోమాకి చేరడం ఆ తర్వాత ఉంటాయి. 1 నుంచి 12 రోజుల్లో పుట్టే ఈ జీవి సోకిన 5 నుంచి 18 రోజుల్లోనే మెదడును తినేస్తుంది. ప్రతి 10 లక్షల మందిలో కేవలం 2.6 మందికే సోకే ఈ వ్యాధి పట్ల కేరళలో అలర్ట్ ప్రకటించారు.