మొన్నటి ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవంపై మాజీ మంత్రులు KTR, హరీశ్ రావులో నిర్వేదం కనిపించింది. ఢిల్లీ పర్యటన(Tour)లో ఉన్న ఆ ఇద్దరూ మీడియాతో చిట్ చాట్ చేశారు. ఇంటర్నల్ గా జరిగిన చాట్లో ఆ ఇద్దరి మాటలిలా…
KTR మాటల్లో…
‘ప్రజలది తప్పు అనడమంటే మాది తప్పవుతుంది.. అభివృద్ధి గురించి చెప్పుకోకున్నా హైదరాబాద్ లో అన్ని సీట్లూ గెలిచాం.. పేరు మార్పుతో ఓడిపోయామని చెప్పడానికి ఆధారం లేదు.. పవన్ కల్యాణ్ విడిగా పోటీ చేసుంటే ఫలితాలు మరోలా ఉండేవి.. ప్రతిరోజూ జనంలోకి వెళ్లే కేతిరెడ్డి ఓడిపోవడం.. సంచులతో దొరికిన వ్యక్తి CM కావడం.. జగన్ ను ఓడించేందుకు షర్మిలను ఉపయోగించారు తప్ప పెద్దగా ఆమె వల్ల ఉపయోగం లేదు.. మాకు అహంకారం అంటూ కృత్రిమ ఆరోపణలు సృష్టించారు..” అన్నవి కేటీఆర్ మాటలు.
హరీశ్ ఇలా…
రేవంత్ కు పాలనపై పట్టు లేదు.. ఫిరాయింపుల(Defections) వల్ల మాకు లాభం జరగలేదు.. మా పార్టీలో చేరినవాళ్లలో 10 మంది ఓడిపోయారు.. సుప్రీం తీర్పు ప్రకారం 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి.. తెలంగాణలో పవర్లోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే.. అని హరీశ్ చిట్ చాట్ చేశారు.