బ్యాటింగ్ తో అదరగొడుతున్న భారత్ చేతిలో రెండో టీ20లో ఓటమి పాలైన జింబాబ్వే నేడు మూడో మ్యాచులో ఆడనుంది. అయితే మరో ముగ్గురు ఆటగాళ్లు చేరడంతో భారత్ మరింత బలం(Strong)గా మారింది. ప్రపంచకప్ జట్టులో సభ్యులైన యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, శివమ్ దూబె రాకతో బ్యాటింగ్ పదునెక్కనుంది. సాయంత్రం 4:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.
ఓపెనింగ్ పైనే…
కెప్టెన్ గిల్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా రాణిస్తున్న(Good Form) వేళ ఇప్పుడు జైస్వాల్ రాకతో పోటీ ఏర్పడింది. శర్మను బ్యాటింగ్ ఆర్డర్లో మారుస్తారా లేక గిల్ సాహసోపేత నిర్ణయం తీసుకుంటాడా అన్నది చూడాల్సి ఉంది. జురెల్ కు శాంసన్, పరాగ్ కు దూబె పోటీ అవుతున్నారు. మొత్తంగా ఈ ముగ్గురి రాకతో గిల్ సేన పటిష్ఠంగా మారితే వీరిని జింబాబ్వే ఎలా అడ్డుకుంటుందో చూడాలి.