గ్రూప్-2, గ్రూప్-3 వాయిదా వేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా పలువులు సాగిస్తున్న ఆందోళనలు.. కోచింగ్ సెంటర్ల ఆదాయం కోసమే వాయిదా ఆంటూ దుష్ప్రచారం చేస్తున్నారంటూ CM రేవంత్ ఆగ్రహం.. ఇలా పరీక్షలపై సందేహాలు ఏర్పడటంతో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) స్పందించింది. పరీక్షల తేదీల మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.
గ్రూప్-2, గ్రూప్-3 వాయిదా అనే ప్రచారం తప్పుడు వార్త అని.. ఇలాంటి వాటిని నమ్మొద్దంటూ అభ్యర్థులకు తెలియజేసింది. 783 గ్రూప్-2.. 1,388 గ్రూప్-3 పోస్టులకు నోటిఫికేషన్ ను TGPSC ఇచ్చింది.