ఏడుసార్లు వింబుల్డన్ ఛాంపియన్ నొవాక్ జకోవిచ్(Djokovic) ఈసారీ సెమీఫైనల్లో ప్రవేశించాడు. అతడి ప్రత్యర్థి ఆస్ట్రేలియాకు చెందిన తొమ్మిదో సీడ్ అలెక్స్ డి మినార్ గాయంతో తప్పుకోవడంతో క్వార్టర్ ఫైనల్ ఆడకుండానే సెమీస్ లోకి ఎంటరయ్యాడు.
పదమూడోసారి…
వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ లో సెమీఫైనల్ చేరడం జకోవిచ్ కు ఇది పదమూడోసారి. మొత్తంగా గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ల చరిత్రలో 49 సార్లు ఈ ఘనతను అందుకున్న ప్లేయర్ గా రికార్డుల్లో నిలిచిపోయాడు. ఇంకో అడుగు దాటితే ఆదివారం జరిగే ఫైనల్లో అతడు తలపడే అవకాశముంది.
మరో మ్యాచ్ లో అమెరికా ఆటగాడు టేలర్ ఫ్రిట్జ్, ఇటలీకి చెందిన లోరెంజో ముసెట్టి తలపడుతున్నారు. ఈ ఇద్దరిలో ఎవరు గెలిస్తే వారితో జకోవిచ్ పోటీపడతాడు.