ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న వెస్టిండీస్ కు తొలి టెస్టులోనే చుక్కలు కనపడ్డాయి. ఇంగ్లిష్ బౌలర్ గస్ అట్కిన్సన్ విజృంభించి 7 వికెట్లు తీయడంతో కరీబియన్లకు కోలుకోలేని దెబ్బ పడింది. ప్రత్యర్థిని 121కే చిత్తు చేసిన ఆ జట్టు.. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టి మొదటిరోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 189 రన్స్ చేసింది.
కరీబియన్లు కష్టంగా…
బ్రాత్ వైట్(6), మికిల్ లూయిస్(27), మెకంజీ(1), అథనేజ్(23), హాడ్జ్(24), హోల్డర్(0), జోషువా(0), జోసెఫ్(17), గుడకేశ్(14) ఇలా తక్కువకే బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. ఆట్కిన్సన్ 7 వికెట్లు తీసి విండీస్ వెన్నువిరిచాడు.
ఇంగ్లండ్ ఇలా…
ఇంగ్లిష్ జట్టుకు ఓపెనర్ క్రాలీ(76) శుభారంభం అందించాడు. డకెట్(3) ఔటైనా పోప్(57)తో కలిసి మంచి పార్ట్నర్షిప్ ఇచ్చాడు. రూట్(15 బ్యాటింగ్), బ్రూక్(25 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతానికి 68 పరుగుల ఆధిక్యంలో ఉంది.