చీకటి రోజులకు నాంది పలికిన ‘ఎమర్జెన్సీ కాలం’పై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 25వ తేదీని ‘రాజ్యాంగ హత్య దినం(సంవిధాన్ హత్యా దివస్)’గా ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ప్రభుత్వ నిర్ణయాన్ని ‘X’లో ట్వీట్ చేశారు. 1975లో ఆ రోజున ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ‘అత్యయిక పరిస్థితి(Emergency)’ విధించిన సంగతి తెలిసిందే.
ఇక ఏటా…
ఎమర్జెన్సీ సమయంలో లక్షల మందిని జైళ్లల్లో పెట్టారని, ప్రజాస్వామ్య గొంతు మూయించిన జూన్ 25న విద్రోహ దినంగా ప్రకటిస్తున్నట్లు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్లో తెలిపింది. ప్రతి సంవత్సరం జూన్ 25ను సంవిధాన్ హత్యా దివస్ గా నిర్వహించి ఎమర్జెన్సీ రోజుల్లో హింసకు గురైన వారిని స్మరించుకోవాలని స్పష్టం చేసింది.