వరుసగా రెండు టీ20ల్లో విజయం సాధించిన భారతజట్టు జింబాబ్వే(Zimbabwe)తో నాలుగో మ్యాచ్ కు రెడీ అయింది. తొలి మ్యాచ్ ఓడినా, 2 కంటిన్యూ విజయాలతో సిరీస్ లో 2-1 నిలిచిన గిల్ సేన… ఈ మ్యాచులో గెలిస్తే సిరీస్ వశమవుతుంది. సాయంత్రం 4:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ బాగా రాణిస్తే.. ఆతిథ్య జట్టు మాత్రం ఫీల్డింగ్ లో ఘెరంగా విఫలమైంది. ముఖ్యంగా గిల్, జైస్వాల్, అభిషేక్, రుతురాజ్ తో భారత టాప్ ఆర్డర్ దుర్భేద్యం(Very Strong)గా కనిపిస్తుంటే.. జింబాబ్వేకు ఎవరో ఒక్కరే ఆడటం ఇబ్బందికరంగా మార్చుతుంది.