మేష రాశి
ఈ రాశి వారికి ఈ రోజు అత్యంత శుభ దినం. ఎప్పటి నుంచో మిమ్మల్ని దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యలు ఈ రోజు పరిష్కారమవుతాయి. ఆర్థిక విషయాల్లో విజయం సాధిస్తారు. కుటుంబం, సంబంధాల్లో సాన్నిహిత్యం ఉంటుంది. వ్యాపారరంగంలో ఉన్నవారికి కొత్త ప్రణాళికలు, కొత్త కొత్త ఆలోచనలు కలిసి వస్తాయి.
వృషభ రాశి
ఈ రాశివారు ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీకు తోబుట్టువులు, ఇరుగుపొరుగు వారి వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. ఎప్పటి నుంచో మిమ్మల్ని వేధిస్తున్న సమస్య ఈ రోజు పరిష్కారమవుతుంది. ఈ రోజు మీరు ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశముంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలకు వెళ్లవచ్చు. అదృష్టం కంటే కర్మను ఎక్కువగా నమ్మండి.
మిథున రాశి
ఈ రాశి స్త్రీ పురుషులు సంతానం కోసం ప్రయత్నిస్తున్నట్టయితే అవి సఫలం అవుతాయి. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. మీరెంచుకున్న దిశగా కొనసాగుతున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ తెలివితేటలతో చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ పిల్లలు చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తారు. వారి విద్యా కార్యకలాపాలలో ఉన్నత శిఖరాలను సాధిస్తారు.
కర్కాటక రాశి
ఉద్యోగ రంగంలో ఉన్న ఈ రాశి స్త్రీ, పురుషులకు సంబంధిత మహిళా అధికారి లేదా మాతృ పక్షం నుంచి మద్దతు ఉంటుంది. కుటుంబ సంబంధాల్లో ఉన్న అన్యోన్యత వలన సాన్నిహిత్యం పెరుగుతుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఈ రోజు మొత్తం మీకు మిశ్రమంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సమష్టి మద్దతుతో కుటుంబ పనులు చేయడంలో నిమగ్నమవుతారు.
సింహ రాశి
ఈ రాశి వారు ఈ రోజు ఆర్థిక విషయాల్లో విజయం సాధిస్తారు. మీరు చేసే వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు సాధించే విజయం ముందు ఎంతటి ప్రత్యర్థి అయినా తలొంచాల్సిందే. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకండి, జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీ కుటుంబ సంబంధాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ పిల్లలకు కొంత స్వేచ్ఛ ఇవ్వండి. దాని కారణంగా వాళ్లు జీవితంలో ఇంకొంచెం ముందుకు వెళ్తారు.
కన్యా రాశి
ఈ రోజు మీరు చేసే సృజనాత్మక ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసిక బలహీనత ఉంటుంది. అనవసర గందరగోళం ఏర్పడి విచారంగా ఉంటారు. జీవనోపాధి రంగంలో పురోగతి ఉంటుంది. వృత్తి పరమైన రంగం లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, అన్వేషించడానికి ఇది అనుకూలమైన సమయం. ఆరోగ్యం పట్ల శ్రద్ద పెట్టండి. అశ్రద్ధ చేయకండి.
తులా రాశి
ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడతాయి. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కుటుంబ ప్రతిష్ఠ పెరుగుతుంది. అనవసర విషయాలకు ఆందోళన చెందకండి. వృథా హడావిడి ఉంటుంది. ఈ రోజు మీరు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సహోద్యోగులతో కలిసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు.
వృశ్చిక రాశి
ఈ రోజు మీరు బహుమతులు, సన్మానాలు పొందే అవకాశముంది. సృజనాత్మక పనిలో విజయం సాధిస్తారు. జీవనోపాధి రంగంలో పురోగతి ఉంటుంది. కుటుంబ, సామాజిక సంబంధాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు అనుకూలమైన రోజు. వ్యాపారంలో అత్యధిక లాభాలు గడిస్తారు. తోబుట్టువులతో ఆనందంగా గడుపుతారు.
ధనుస్సు రాశి
ఈ రాశి వారికి ఈ రోజు అత్యంత శుభ దినం. మీ తెలివితేటలతో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ జీవిత భాగస్వామి మద్దతు, సాంగత్యం పరిపూర్ణంగా లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండండి. మీ ఆలోచనలను, అభిప్రాయాలను ఇతరులతో పంచుకోవద్దు. తరవాత అది మీకు నష్టం చేకూరుస్తుంది.
మకర రాశి
ఈ రాశి వారికి ఈ రోజు మీ జీవిత భాగస్వామినుంచి పూర్తి మద్దతు, సాంగత్యం లభిస్తుంది. బంధువుల నుంచి కొంత ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం పై శ్రద్ద పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మొత్తం మీకు మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగులు ఆఫీసులో అదనపు పని చేసి, ఆగిపోయిన పనిని త్వరగా పూర్తి చేస్తారు.
కుంభ రాశి
ఈ రోజు మీ ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడతాయి. ఈ రోజు ఈ రాశి వారు ఇతరుల సహకారంతో పనుల్లో విజయం సాధిస్తారు. అనవసర గందరగోళం వలన వృథా హడావుడి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ రోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. ఒత్తిడి కారణంగా మీరు మీ పనిపై సీరియస్ గా దృష్టి పెట్టలేరు. కావున పనుల్లో జాప్యం ఉంటుంది.
మీన రాశి
ఈ రోజు ఈ రాశి వారికి జీవనోపాధి రంగంలో కొనసాగుతున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికాభివృద్ధి మెరుగుపడుతుంది. సంఘంలో సంపద, పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి వ్యాపార ప్రణాళికలు విజయవంతమవుతాయి. మీ జీవిత భాగస్వామితో ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవ్యక్తులు కొన్ని వివాదాస్పద పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
రాళ్లపల్లి సరస్వతీదేవి