మైక్రోసాఫ్ట్ CEO(చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)గా తెలుగు వ్యక్తి సత్య నాదేళ్ల పదేళ్లు పూర్తి చేసుకున్నారు. 2014 ఫిబ్రవరిలో మైక్రోసాఫ్ట్ బాస్ గా బాధ్యతలు చేపట్టి క్లౌండ్ కంప్యూటింగ్(Cloud Computing)లో విప్లవం తీసుకొచ్చారు నాదెళ్ల. ప్రపంచంలోనే కంపెనీని రెండో స్థానానికి చేర్చి క్లౌడ్ బిజినెస్ లో ఓపెన్ సోర్స్ టెక్నాలజీని ప్రవేశపెట్టిన ఘనుడాయన.
20 నిమిషాల్లోనే…
నాదెళ్ల వల్ల గత కొన్నేళ్ల క్రితమే క్లౌడ్ కంప్యూటింగ్ లో మైక్రోసాఫ్ట్(Microsoft) తన ఆదాయాన్ని రెండింతలు చేసుకుంది. అప్పట్నుంచి ఇప్పటిదాకా అమెజాన్ తర్వాత సెకండ్ ప్లేస్ లో కొనసాగుతున్నదా కంపెనీ. గత పదేళ్లలో క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా కంపెనీకి భారీస్థాయిలో ఆదాయాన్ని తెచ్చినట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక తెలిపింది. 7.5 బిలియన్ డాలర్ల(రూ.63,000 కోట్లు) విలువైన ప్రపంచ ప్రఖ్యాత ఓపెన్ సోర్స్ కంపెనీ ‘గిట్ హబ్’ను కొనుగోలు చేసేందుకు గాను నాదెళ్లకు కేవలం 20 నిమిషాలే పట్టిందని ఆ కథనంలో రాసింది.