కేన్సర్ తో బాధపడుతూ చికిత్స(Treatment) తీసుకుంటున్న మాజీ క్రికెటర్ అన్షుమన్ దత్తాజీరావ్ గైక్వాడ్(71)కు భారత క్రికెట్ బోర్డు(BCCI) బాసటగా నిలిచింది. గైక్వాడ్ ఆరోగ్య పరిస్థితుల్ని తెలుసుకుంటున్న బోర్డు కార్యదర్శి జై షా.. అపెక్స్ కౌన్సిల్ నుంచి వెంటనే కోటి రూపాయలు ఆయనకు అందజేశారు. ఆయనకు ఎలాంటి సహకారమైనా అందించేందుకు ముందుంటామని BCCI ప్రకటించింది.
వరల్డ్ కప్ టీమంతా…
గైక్వాడ్ పరిస్థితికి చలించిపోయిన కపిల్ దేవ్.. సాయం చేయాల్సిందిగా బోర్డుకు సూచించాడు. వరల్డ్ కప్ జట్టులో సభ్యుడైన అన్షుమన్ కు ఆనాటి టీంలోని మొహిందర్ అమర్నాథ్, సునీల్ గవాస్కర్, సందీప్ పాటిల్, దిలీప్ వెంగ్సర్కార్, మదన్ లాల్, రవిశాస్తి విరాళాలు సేకరిస్తున్నారు.
40 టెస్టులు, 15 వన్డేలు ఆడిన గైక్వాడ్.. రెండుసార్లు నేషనల్ టీమ్ కు కోచ్ గా పనిచేశాడు. అన్షుమన్ తండ్రి దత్తా సైతం టెస్ట్ క్రికెట్ ఆడారు.