వరుసగా మూడు మ్యాచ్ లు కోల్పోయి సిరీస్ చేజార్చుకున్న జింబాబ్వే.. చివరి టీ20లోనూ విజయం దిశగా సాగలేదు. దీంతో గిల్ సేన కంటిన్యూగా నాలుగు మ్యాచ్ లు గెలిచి సిరీస్ ను 4-1 తేడాతో గెలుచుకుంది. భారత్ విసిరిన 168 పరుగుల లక్ష్యాన్ని చేరుకునేందుకు కష్టాలు పడింది. 18.3 ఓవర్లలోనే 125కు కుప్పకూలి 42 రన్స్ తేడాతో ఓటమి పాలైంది.
మారని ఆట…
మధేవ్రె(0), మరుమాని(27), బెనెట్(10), మయర్స్(34), కెప్టెన్ సికిందర్(8), క్యాంప్ బెల్(4), కీపర్ మదాండె(1).. ఇలా అంతా నిలవలేక వికెట్లు పారేసుకున్నారు. 94కే ఏడు వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టు ఏ మాత్రం టార్గెట్ దిశగా సాగలేదు. పేస్ బౌలర్ ముకేశ్ కుమార్ 4, ఆల్ రౌండర్ శివమ్ దూబె 2 వికెట్లు తీసుకున్నారు.