ప్రధానమంత్రి నరేంద్రమోదీ సామాజిక మాధ్యమా(Social Media)ల్లో మరో రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ప్రపంచంలోనే ఏ దేశాధినేతకు లేనంత ఫాలోవర్ల(Followers)ను ‘X(పాత ట్విటర్)’లో సంపాదించుకున్నారు. 2009లో అకౌంట్ ఓపెన్ చేసిన మోదీ.. 15 ఏళ్లలో నంబర్ వన్ అయ్యారు.
ఎంతంటే…
నరేంద్రమోదీ ‘X’ ఖాతా సంఖ్య 100 మిలియన్లు(10 కోట్ల మంది) ఫాలోవర్లకు చేరింది. జులై 14నే ఆయన ఈ ఘనతను చేరుకున్నారు. ఆయనకు దరిదాపుల్లోనూ ఎవరూ లేరంటే మోదీకి ఉన్న స్పెషాలిటీ ఏంటో అర్థమవుతుంది. తర్వాతి ప్లేస్ లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 38 లక్షల ఫాలోవర్లతో ఉన్నారు.
ఓవరాల్ గా…
ఓవరాల్ గా చూస్తే టెస్లా, ‘X’ అధినేత ఎలాన్ మస్క్ 188.7 మిలియన్ల ఫాలోవర్లతో ప్రపంచ నంబర్ వన్ గా ఉన్నారు. 131 మిలియన్లతో US మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సెకండ్ ప్లేస్ దక్కించుకున్నారు.