స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా వీడ్కోలు(Retirement)తో పొట్టి ఫార్మాట్లో(T20) ఇక హార్దిక్ పాండ్య ఒక్కడే ఆల్ రౌండర్ అనుకున్నాం. కానీ జింబాబ్వేతో ప్రదర్శన చూశాక.. టీమ్ఇండియాకు మరో ఇద్దరు ఆల్ రౌండర్లు దొరికినట్లేనని నిపుణులు అంటున్నారు. ఆ ఇద్దరితో కలిసి జట్టులో మొత్తం నలుగురైదుగురు బ్యాటింగ్, బౌలింగ్ చేసే స్థాయిలో ఉన్నారు.
ఆ ఇద్దరే…
వాషింగ్టన్ సుందర్ ఫుల్ టైమర్ కాగా అభిషేక్ శర్మ, శివమ్ దూబె రూపంలో ఇద్దరు ఆల్ రౌండర్లు దొరికారు. IPLలో కేవలం ఒక్క ఓవర్ చొప్పున మాత్రమే వేసిన దూబె.. జింబాబ్వేతో చివరి మ్యాచ్ లో 2 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. అతడు కీలకమైన మయర్స్, క్యాంప్ బెల్ వికెట్లు తీయడంతోనే జింబాబ్వే పరాజయం పాలైంది. మూడు మ్యాచ్ ల్లో 8 ఓవర్లు వేసిన దూబె చివరి టీ20లో పూర్తి స్పెల్ కంప్లీట్ చేయడానికి తోడు అంతకుముందు బ్యాటింగ్ లో 12 బాల్స్ లోనే 26 పరుగులు చేశాడు.
అభి’షేకే’…
బ్యాటింగ్ లో వీరవిహారం చేసే అభిషేక్ శర్మ సైతం నాలుగో టీ20లో 3 ఓవర్లలో 20 రన్సే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఇంకో వికెట్ తీసేవాడే కానీ క్యాచ్ ను రుతురాజ్ మిస్ చేశాడు. పూర్తి గ్రిప్ తో టర్న్ చేస్తూ బౌన్స్ రాబట్టడంలో అతడు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అక్షర్ పటేతో కలిపితే స్పిన్ ఆల్ రౌండర్ల సంఖ్య టీమ్ఇండియాలో అంతకంతకూ పెరిగిపోయింది.