పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం(Treasury) 46 ఏళ్ల తర్వాత తెరచుకుంది. అది తెరిచాక పాములు వచ్చాయా… ముందుగా ప్రచారం జరిగినట్లు గది తాళం తీసేటప్పుడు పాముల బుసలు వినిపించాయా… ఈ ప్రశ్నలకు సమాధానాలిచ్చారు అక్కడి ఉన్నతాధికారులు.
ఎలా తీశారంటే…
నాగబంధం తరహాలో పూరీ క్షేత్ర సంపదకు పాముల రక్షణ ఉంటుందన్న కోణంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు(Precautions) తీసుకుంది. పాములు పట్టే 11 మందిని రెడీగా ఉంచింది. అందులో ముగ్గుర్ని బయటే ఉంచి అత్యవసర పరిస్థితిల్లో ఏం చేయాలో ఆదేశాలిచ్చింది. అలా తాళం తెరుస్తూనే చుట్టూ పరిశీలించారు అందులోకి వెళ్లినవారు.
కానీ ఎక్కడా…
కానీ గదంతా చూసినా ఎక్కడా పాములు కనిపించలేదని స్నేక్ హెల్ప్ లైన్ తెలిపింది. పూరీ జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ తోపాటు నగల లెక్కింపు కోసం ఏర్పాటైన 16 మంది సభ్యుల కమిటీ ఛైర్మన్ జస్టిస్ బిశ్వనాథ్ రథ్ సైతం పాములు ఉన్నాయన్నది నిజం కాదు అని క్లారిటీ ఇచ్చారు. గది తెరిస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారని, కానీ తామంతా క్షేమంగానే ఉన్నామన్నారు.