భారత్ రాష్ట్ర సమితి(BRS) నుంచి మరో వికెట్ పడిపోయింది. గత తొమ్మిది రోజుల్లోనే నలుగురు MLAలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తాజాగా పటాన్ చెరు శాసనసభ్యుడు మహిపాల్ రెడ్డి.. CM సమక్షంలో హస్తం పార్టీలో చేరారు. అటు ఆ పార్టీ జహీరాబాద్ MP అభ్యర్థి గాలి అనిల్ తోపాటు పలువురు హైదరాబాద్ కార్పొరేటర్లు సైతం పార్టీ వీడారు.
9 రోజుల్లోనే…
ఈ నెల 6న గద్వాల, 12న రాజేంద్రనగర్, 13న శేరిలింగంపల్లి, ఇవాళ పటాన్ చెరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
పార్టీ వీడిన ఎమ్మెల్యేల లిస్టు ఇలా…
దానం నాగేందర్………: ఖైరతాబాద్
కడియం శ్రీహరి………: స్టేషన్ ఘన్పూర్
తెల్లం వెంకట్రావు………: భద్రాచలం
పోచారం శ్రీనివాసరెడ్డి………: బాన్సువాడ
సంజయ్ కుమార్………: జగిత్యాల
కాలే యాదయ్య………: చేవెళ్ల
బండ్ల కృష్ణమోహన్ రెడ్డి………: గద్వాల
ప్రకాశ్ గౌడ్………: రాజేంద్రనగర్
అరికెపూడి గాంధీ………: శేరిలింగంపల్లి
గూడెం మహిపాల్ రెడ్డి………: పటాన్ చెరు