విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై ఏర్పాటైన జ్యుడీషియల్(Judicial) కమిషన్(Commission) తీరును సవాల్ చేస్తూ KCR వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలిచ్చింది. కమిషన్ ఛైర్మన్ నరసింహారెడ్డి తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన చీఫ్ జస్టిస్(CJI) డి.వై.చంద్రచూడ్.. ఆయన్ను మార్చాలంటూ ఆదేశాలిచ్చారు. ఆయన నేతృత్వంలోనే ఇద్దరు జడ్జిల బెంచ్ కేసు విచారణ చేపట్టింది.
నిష్పాక్షికంగా…
కమిషన్ ఛైర్మన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ప్రెస్ మీట్ పెట్టి ఒకరికి ప్రతికూలంగా మాట్లాడటం సరికాదని అభిప్రాయపడ్డారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ లూథ్రా కోర్టుకు వివరణ ఇచ్చారు.
KCR తరఫున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. అటు CJI అభ్యంతరంతో కమిషన్ ఛైర్మన్ ను మార్చుతామని ప్రభుత్వ న్యాయవాదులు తెలియజేశారు. దీంతో ఈ కేసును మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తూ CJI బెంచ్ నిర్ణయం తీసుకుంది.