రుణమాఫీ పథకంపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18నాడు సాయంత్రంలోగా లక్ష రూపాయల లోపు ఉన్న రుణాలు మాఫీ చేయనున్నట్లు కలెక్టర్ల సమావేశంలో పూర్తి క్లారిటీ ఇచ్చింది. ఈ కార్యక్రమాన్ని సంబరంగా జరుపుకోవాలని, ప్రజాప్రతినిధులంతా పాల్గొనాలని స్పష్టం చేసింది. రైతుల ఖాతాల్లోనే నేరుగా అసలు, వడ్డీ కలిపి నిధులు వేస్తున్నందున వాటిల్లో తేడా రాకుండా చూసుకోవాలని బ్యాంకర్లను ఆదేశించింది..
పాస్ బుక్ తోనే…
పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ చేయాలని, కానీ కుటుంబ వివరాల కోసమే రేషన్ కార్డును పరిగణలోకి తీసుకోవాలని కలెక్టర్లకు CM సూచించారు. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఆరోహణ క్రమంలో అంటే తక్కువ మొత్తం నుంచి ఎక్కువ మొత్తంలో మాఫీ చేసేలా రూల్స్ తయారు చేశారు.