దేశ సర్వోన్నత న్యాయస్థానాని(Supreme Court)కి మరో ఇద్దరు న్యాయమూర్తుల్ని నియమించినట్లు కేంద్ర న్యాయశాఖ తెలిపింది. జమ్మూకశ్మీర్, లద్దాఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(CJ) ఎన్.కోటీశ్వర్ సింగ్.. మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ ఆర్.మహదేవన్ లను నియామకాలకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశాక.. ఆ అపాయింట్మెంట్లను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ‘X(పాత ట్విటర్లో)’ ప్రకటించారు.
ఫుల్ బెంచ్…
వారిద్దరూ ప్రమాణ స్వీకారం చేస్తే సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య CJIతో కలిపి 34కు చేరుకుంటుంది. మణిపూర్ నుంచి టాప్ కోర్టుకు నియామకమైన తొలి వ్యక్తి జస్టిస్ కోటీశ్వర్ సింగ్. 1986లో అడ్వొకేట్ గా ప్రాక్టీస్ మొదలుపెట్టిన ఆయన.. మణిపూర్ మొదటి అడ్వకేట్ జనరల్(AG) అయిన ఎన్.ఇబొటోంబిసింగ్ తనయుడు. గువాహటి, మణిపూర్ హైకోర్టుల్లో లాయర్ గా జస్టిస్ కోటీశ్వర్ సింగ్ పనిచేశారు.