ఉస్మానియా విశ్వవిద్యాలయాని(OU)కి చెందిన 17 మంది విద్యార్థులను ఒకేసారి బ్యాంకింగ్ ఉద్యోగాలు వరించాయి. MBA, టెక్నాలజీ మేనేజ్మెంట్ విభాగాల విద్యార్థులు HDFCలో మేనేజర్ స్థాయి పోస్టులు దక్కించుకున్నారు. వీరందర్నీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ అభినందించారు.
జీతమెంతంటే…
వీరిలో కొందరికి అత్యధికం(Highest)గా ఏడాదికి రూ.23 లక్షల ప్యాకేజీ ఉండగా.. ఇంకొందరు రూ.8 లక్షల వరకు అందుకోనున్నారు. ఉద్యోగాలకు సెలెక్టయిన అభ్యర్థులకు HDFC నేషనల్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఆరుగురు మేనేజర్లు నియామక పత్రాలు అందజేశారు. నాలుగో సెమిస్టర్ చదువుతున్న 120 మందిలో ఇప్పటికే 109 మందికి ఉద్యోగాలు లభించాయి.
100% ప్లేస్మెంట్స్…
ఈ నెలాఖరుకల్లా మరో 10 కంపెనీలు రాబోతున్నందున 100 శాతం ప్లేస్మెంట్ పూర్తవుతుందని MBA కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొ.శ్రీరాములు తెలియజేశారు. రాత పరీక్ష(Written Test), గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల ద్వారా ఇంతమందికి ఉద్యోగాలు దక్కడం OUకున్న విశ్వసనీయతను గుర్తు చేస్తుందని ప్రొఫెసర్లు ఆనందంతో చెబుతున్నారు.
డిపార్ట్మెంట్ డీన్ ప్రొ.వెంకటయ్య, HOD ప్రొ.సుధా, ఛైర్మన్ స్మిత, ప్లేస్మెంట్ ఆఫీసర్ జహంగీర్, డా.విద్యాసాగర్ రావు, డా.సమున్నతతోపాటు HDFC ప్రతినిధులు విద్యార్థుల్ని అభినందించారు.