రైతుల్ని విముక్తి చేసే రుణమాఫీ విషయంలో CM రేవంత్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఆగస్టు లోపు మొత్తంగా మూడు(Three) విడత(Phases)ల్లో రుణమాఫీ జరుగుతుందని వివరించారు. తొలుత లక్ష, ఆ తర్వాత లక్షన్నర, చివరకు రూ.2 లక్షల మేర ఉన్నవి మాఫీ అవుతాయన్నారు.
రేపు సాయంత్రం 4 గంటల లోపు లక్ష రూపాయల లోపు గల రుణాలకు సంబంధించి రూ.7,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమవుతాయన్నారు. ఈ నెలాఖరులో లక్షన్నర, ఆగస్టులో రూ.2 లక్షల మేరకు.. ఇలా తాము ఇచ్చిన హామీ ప్రకారం పంద్రాగస్టు వరకు రూ.31 వేల కోట్ల హామీ నెరవేరుతుందన్నారు.