
కొద్దిరోజులు కామ్ గా కొనసాగిన తమిళనాడు గవర్నర్-సీఎం యుద్ధం మళ్లీ మొదలైంది. అవినీతి ఆరోపణల కేసులో అరెస్టయిన మంత్రి వి.సెంథిల్ బాలాజీని CM ఎం.కె.స్టాలిన్ కు తెలియకుండా గవర్నర్ బర్తరఫ్ చేయడంపై వారం క్రితం రాజకీయ రగడ జరిగింది. దీనిపై న్యాయపోరాటానికైనా సిద్ధమని DMK తెలిపింది. అయితే అప్పట్నుంచి మళ్లీ ఈ ఇష్యూ బయటకు రాలేదు. కానీ ఇప్పుడు CM స్టాలిన్ ఏకంగా రాష్ట్రపతికే ఫిర్యాదు చేశారు. తమిళనాడులో శాంతిని కోల్పోయేలా గవర్నర్ R.N.రవి చేష్టలు ఉన్నాయని, మత విద్వేషాలను పెంచుతున్న ఆయన రాజ్యాంగ పదవిలో కొనసాగడానికి అర్హులు కారంటూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపదీ ముర్ముకు లెటర్ రాశారు.
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా గవర్నర్ ఉంటున్నారు.. బిల్లులు, దస్త్రాలు ఆమోదించకుండా వాటిని తొక్కిపెడుతూ టైమ్ వేస్ట్ చేస్తున్నారు.. గవర్నర్ గా వచ్చినప్పటి నుంచి మా గవర్నమెంట్ తో యుద్ధం చేస్తున్నారంటూ రాష్ట్రపతికి ఇచ్చిన కంప్లయింట్ లో వివరించారు.