తెలంగాణ-ఛత్తీస్ గఢ సరిహద్దు(Border)ల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర పోరు కొనసాగుతున్నది. ఇరువర్గాల మధ్య పొద్దున్నుంచి భారీస్థాయిలో కాల్పులు జరుగుతున్నాయి. మావోయిస్టులకు చెందిన ఆయుధ సామగ్రి(Weapons)ని పెద్దయెత్తున స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఎదురుకాల్పుల్లో పలువురు మృతి చెందినట్లు తెలుస్తుండగా.. ఇప్పటివరకు ఒక మావోయిస్టు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇలిమిడి అటవీప్రాంతంలో ఇరువర్గాలు ఎదురుపడగా కాల్పులు మొదలయ్యాయి.