మైక్రోసాఫ్ట్ విండోస్(Windows)లో తలెత్తిన సాంకేతిక(Technical) సమస్యతో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా సహా ప్రపంచంలోని పలు దేశాల్లో సర్వీసులు నిలిచిపోయాయి. ముఖ్యంగా విమానాలన్నీ రద్దు చేసుకోవాల్సి వచ్చింది. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ లో ఏర్పడిన సమస్య కారణంగా ఎయిర్ లైన్స్, బ్రాడ్ కాస్టింగ్, బ్యాంకింగ్, ఐటీ సహా అన్ని రంగాలు స్తంభించిపోయాయి. విండోస్ 10, 11 ఆపరేటింగ్ సిస్టమ్స్ గల కంప్యూటర్లు మొరాయిస్తున్నాయి.
కంప్యూటర్లలో బ్లూ స్క్రీన్ ఎర్రర్ కు సైబర్ దాడులు కారణం కాదని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. సమస్య పరిష్కారానికి ‘డీబగ్’ తయారుచేసినట్లు తెలిపింది. ఈ ఎర్రర్ తో సిస్టమ్స్ పదే పదే రీస్టార్ట్ అవుతున్నాయి. శంషాబాద్ సహా దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లోనూ ఫ్లైట్ సర్వీసులు నిలిచిపోయాయి.