గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల విషయంలో అభ్యర్థులు, విద్యార్థి సంఘాల ఆందోళనల నడుమ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల వాయిదా అంశాన్ని పరిశీలించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క… పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC)ని ఆదేశించారు. తనతో భేటీ అయిన అభ్యర్థులతో మాట్లాడిన భట్టి… అక్కడికక్కడే TGPSC ఛైర్మన్ మహేందర్ రెడ్డికి ఫోన్ చేశారు.
పరీక్షల్ని డిసెంబరుకు వాయిదా వేసే అంశాన్ని పరిశీలించాలంటూ డిప్యూటీ CM ఆదేశాలిచ్చారు. నిరుద్యోగుల కోరిక మేరకు ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆయన తెలియజేశారు. విద్యార్థుల డిమాండ్లకు డిప్యూటీ CM సానుకూలంగా స్పందించారని, డిసెంబరులో జరగాల్సిన పరీక్షల తేదీల్ని ప్రకటిస్తారని మల్లు రవి తెలిపారు.