గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) ప్రకటించింది. ఆగస్టు 7, 8 తేదీల్లో జరగాల్సిన పరీక్షలు డిసెంబరులో నిర్వహిస్తామని అధికారికంగా వెల్లడించింది. పరీక్షలు నిర్వహించే తేదీలను తర్వాత ప్రకటిస్తామని స్పష్టం చేసింది.
గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల విషయంలో అభ్యర్థులు, విద్యార్థి సంఘాల ఆందోళనల నడుమ రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందే కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల వాయిదా అంశాన్ని పరిశీలించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క… TGPSCని ఆదేశించారు.
తనతో భేటీ అయిన అభ్యర్థులతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి… అక్కడికక్కడే TGPSC ఛైర్మన్ మహేందర్ రెడ్డికి ఫోన్ చేశారు. భట్టి విక్రమార్క ఆదేశాలతో పరీక్షల్ని వాయిదా వేయాలని కమిషన్ నిర్ణయించింది.