టీ20ల్లో రికార్డ్ లెవెల్ స్కోరుతో భారత మహిళల జట్టు కంటిన్యూగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆసియా కప్ లో భాగంగా UAEతో జరిగిన మ్యాచులో కెప్టెన్ హర్మన్ ప్రీత్, కీపర్ రిచా ఘోష్ దాడితో తొలుత 201/5 పరుగుల భారీ స్కోరు చేసింది. కానీ ఓవర్లు ముగిసేసరికి UAE 123/7తో నిలిచి 78 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు షెఫాలి(37; 18 బంతుల్లో 5×4, 1×6), మంధాన(13), హేమలత(2), హర్మన్ (66; 47 బంతుల్లో 7×4, 1×6), జెమీమా(14), రిచా(64 నాటౌట్; 29 బంతుల్లో 12×4, 1×6) చేశారు. పొట్టి ఫార్మాట్లో భారత్ కు ఇదే అత్యధిక స్కోరు. గతంలో ఇంగ్లండ్ పై సాధించిన 198/4 ఇప్పటిదాకా హయ్యెస్ట్ కాగా ఇప్పుడా రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.
UAE టీంలో కెప్టెన్ ఇషా ఒజా(38), కవిషా(40) మాత్రమే రాణించారు. దీప్తి శర్మ రెండు వికెట్లు తీసింది.