ఎగువన కురుస్తున్న వర్షాలు, రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న వర్షపాతం(Rainfall)తో గోదావరి పోటెత్తుతున్నది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా.. మధ్యాహ్నాని(Afternoon)కి రెండో హెచ్చరిక జారీ చేసే అవకాశముంది. పొద్దున 11 గంటలకు నీటిమట్టం 47.50 అడుగులకు చేరుకోగా.. 11.19 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది.
ఏజెన్సీలోని చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని 20 గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. గ్రామాలకు బయటి నుంచి సంబంధాలు(Communications) తెగిపోయాయి. వరద ముంపుతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
ప్రస్తుతానికి పైనుంచి వరద(Flood) తగ్గినా ఈ రాత్రికి 51 అడుగులకు పెరిగే అవకాశమున్నట్లు అధికారిక వర్గాలు అంటున్నాయి. అశ్వాపురం, గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో వాగులు పొంగి 10 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.