
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి ప్రజల నుంచి నిరసన ఎదురైంది. ఘట్ కేసర్ మండలం కాచవానిసింగారంలో స్థానికుల నుంచి విపత్కర పరిస్థితిని ఎదుర్కొన్నారు. డెవలప్ మెంట్ వర్క్స్ కోసం కాచవానిసింగారం వెళ్లిన మంత్రిని అక్కడివారు అడ్డుకున్నారు. గ్రామంలో సమస్యల గురించి ఎవరూ పట్టించుకోవట్లేదని… పంచాయతీ ల్యాండ్ లో BC బిల్డింగ్ నిర్మించాలని డిమాండ్ చేశారు.
సమస్యలు చెబుతుండగా గ్రామస్థులను అక్కణ్నుంచి పంపించివేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో వారంతా పోలీసులు, మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విలేజర్స్ ఆందోళనతో అక్కడి నుంచి మల్లారెడ్డి తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది.