కొత్త ఉద్యోగాల కల్పనలో తొలి నెల జీతం ప్రభుత్వమే చెల్లించనుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. EPFO చెల్లింపుల్లో తొలి నాలుగేళ్లు ప్రోత్సహకాలు అందిస్తామని.. ఈ నిర్ణయంతో 1.10 కోట్ల మందికి లబ్ధి కలుగుతుందన్నారు.
రికార్డు స్థాయిలో వరుసగా ఏడోసారి బడ్జెట్(Budget) ప్రవేశపెట్టిన నిర్మల.. విద్య, నైపుణ్యాభివృద్ధి(Skill Development) కోసం 48,000 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు తెలిపారు. ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా రాజధాని నిర్మాణం కోసం రూ.15,000 కోట్లు ప్రకటించారు.